Site icon NTV Telugu

Japan: చైనాకు చెక్ పెట్టిన ఇండియా ఫ్రెండ్.. డ్రాగన్ ఆట ముగిసినట్లే!

India Japan

India Japan

Japan: ప్రపంచ సాంకేతికత, ఆధునిక యుద్ధానికి పునాది అయిన అరుదైన భూమి లోహాలపై చైనా గుత్తాధిపత్యం కలిగి ఉంది. 2025లో చైనా విధించిన ఆంక్షల తరువాత ఇండియా స్నేహితుడు అయిన జపాన్ బీజింగ్‌కు చెక్ పెట్టింది. వాస్తవానికి ప్రపంచం ఇప్పటివరకు చైనాపై ఆధారపడిన విలువైన ఖనిజాలను వెలికితీసేందుకు జపాన్‌కు చెందిన ఒక భారీ నౌక బయలుదేరింది. దీంతో ఈ ఆటలో ఇకపై చైనా ఆట ముగిసినట్లే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: NHAI Recruitment 2026: ఎన్ హెచ్ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.1.77 లక్షల జీతం.. రాత పరీక్ష లేదు

రాయిటర్స్ నివేదికల ప్రకారం.. జపాన్ యొక్క పరీక్షా నౌక చిక్యూ, టోక్యో నుంచి దాదాపు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరి ద్వీపం వైపు వెళుతోంది. ఈ ఓడ యొక్క లక్ష్యం చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే ఇది మినామిటోరి ద్వీపం ప్రాంతంలోని సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్లు (4 మైళ్ళు) దిగువన డైవ్ చేయబోతుంది. ఈ సముద్రపు అడుగున ఉన్న బురదలో అరుదైన మట్టి లోహాల అపార నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇంత లోతు నుంచి నిరంతరం బురదను వెలికితీసి విశ్లేషించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. 130 మంది సిబ్బంది, పరిశోధకుల బృందంతో కూడిన ఈ నౌక ఈ మిషన్‌ను పూర్తి చేసి ఫిబ్రవరి 14 నాటికి తిరిగి వస్తుందని సమాచారం.

ఈ రోజు మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, జాతీయ భద్రత కోసం మోహరించిన క్షిపణి వ్యవస్థల సృష్టిలో అరుదైన మట్టి లోహాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు జపాన్, పాశ్చాత్య దేశాలు ఈ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడ్డాయి. అయితే బీజింగ్‌తో కొనసాగుతున్న దౌత్య వివాదాల మధ్య, చైనా ఈ ముఖ్యమైన ఖనిజాల ఎగుమతిపై అనేక ఆంక్షలు విధించింది. చైనా నుంచి ఈ “బ్లాక్‌మెయిలింగ్”ను నివారించడానికి, జపాన్ ఇప్పుడు సరికొత్త అన్వేషణ వైపు అడుగులు వేస్తోంది. ఈ మిషన్ విజయవంతమైతే సాంకేతిక రంగంలో సరఫరాలపై చైనా ఆధిపత్యం అంతం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

పలు నివేదికల ప్రకారం.. జపాన్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా దీని కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు అధిపతి షోయిచి ఇషి ఓడ ప్రారంభం అయినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల దిగువన వనరులను వెలికితీయడం ఒక పెద్ద సాంకేతిక విజయం అని షోయిచి ఇషి చెప్పారు. ఈ విజయం జపాన్ వనరుల సేకరణ పద్ధతులను పూర్తిగా మారుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

READ ALSO: Sreeleela: ‘శ్రీలీల’ నీకే ఎందుకు ఇలా..

Exit mobile version