NTV Telugu Site icon

Japan Movie: ‘జపాన్ ‘ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Japan

Japan

తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ఇది.. మొదటి సినిమా ఖైదీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ఆ సినిమా తర్వాతే వచ్చిన ఈ నిరాశను మిగిల్చింది.. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. నటనపరంగా కార్తీ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఈ మూవీ కమర్షియల్ గా అంతగా హిట్ కాలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలై నెలరోజులు గడవకముందే జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా డిసెంబర్ 1 న లేదా 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు తెలస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీను స్ట్రీమింగ్ చేయనున్నారట..

ఇకపోతే డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఇందులో సునీల్, విజయ్ మిల్టన్ కీలకపాత్రలు పోషించారు. ఈలో హీరో కార్తీకి బంగారం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాగా జీవిస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి అతడు రూ.200 కోట్ల విలువైన బంగారం దొంగతనం చేశాడని నిందపడుతుంది. చేయని నేరం నుంచి కార్తీ ఎలా తప్పించుకున్నాడనేది జపాన్ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది.. ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..