NTV Telugu Site icon

Janvi Kapoor : ఆ స్టార్ హీరోతో నటించొద్దు.. జాన్వీ కపూర్ కు వార్నింగ్ ఇచ్చిన బోనీ

Janhvi Kapoor sizzles in her latest pics

Janvi Kapoor :శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దఢక్ సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఆపై వరుస సినిమాలలో నటిస్తుంది. ఇటీవలే వరణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టవివ్ గా ఉండే జాన్వీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది.  కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తన తల్లి శ్రీదేవి ఎంతో ఫేమస్ అయిన టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.

Also Read: Nithya Menen: పెళ్లి కూతురు డ్రెస్ లో సందడిచేస్తున్న నిత్య మేనేన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఢిపరెంట్ గా కనిపించనుందని టాక్ నడుస్తుంది. సౌత్ ఇండస్ట్రీపై కన్నేసిన ఈ అమ్మడు తమిళ సినిమాలలో కూడా తనకు నటించాని ఉండదని చెబుతుంది. అందుకోసం ఏకంగా తమిళ సినిమాలన్నీ చూస్తుందంట. అయితే జాన్వీ తమిళ సినిమా ఎంట్రీ గురించే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది.

ఆమె ఏ హీరోతో తమిళ సినిమా హీరోతో ఎంట్రీ ఇవ్వాలి అన్నదానిపై ఇప్పటికీ జాన్వీ తండ్రి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఒక నిర్ణయానికి వచ్చేశారట. ఆమె తొలిసారి అజిత్ తో కలిసికానీ, విజయ్ తో కలిసి కానీ కోలివుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వాలని బోనీ కోరుకుంటున్నారట. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చివరకు హాలీవుడ్ వరకు ఫేమస్ అయిన ధనుష్ సరసన మాత్రం నటించవద్దని జాన్వీకి కండీషన్ పెట్టారట బోనీ కపూర్. అయితే ఇలా ప్రసారమవుతున్న వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. అయితే ధనుష్ తో మాత్రం సినిమా వద్దని బోనీ ఎందుకు చెప్పారు అనే కారణాల పై ప్రస్తుతం చర్చ జరుగుతుంది

Show comments