NTV Telugu Site icon

Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం రేట్లు ఇవే

Gold

Gold

Gold Price : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరించాల్సిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి అధికా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతిరోజూ బంగారం షాపింగ్ చేసినా బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

Read Also:Champions Trophy 2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించే ఛాన్స్!

కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా.. మరోసారి నిరాశకు గురవుతుంటారు. కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు కాస్త ఊరట నిచ్చాయి. హైదరాబాదులో నేటి బంగారం ధర..22 క్యారెట్ల బంగారం ధర- రూ. 74, 350గా ఉంది. నిన్నటితో పోలిస్తే 150తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర- రూ. 81,110గా ఉంది.. నిన్నటి తో పోలిస్తే 160రూపాయలు తగ్గింది. కాగా వెండి ధరలో మార్పు లేదు. నిన్నటి ధర దగ్గర స్థిరంగా ఉంది. కిలో వెండి రూ. 1,04,000 పలుకుతోంది.

Read Also:Barack Obama : డివోర్స్ తీసుకుంటున్నారన్న ప్రచారానికి ముగింపు పలికిన బరాక్ ఒబామా