Jannik Sinner Stuns Novak Djokovic in Australian Open 2024 Semi Final: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) ఇంటిదారి పట్టగా.. తాజాగా సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ కూడా ఇంటిముఖం పట్టాడు. మెల్‌బోర్న్ పార్క్‌లో శుక్రవారం జరిగిన సెమీస్‌లో జకోను ఇటాలియన్ స్టార్ జనిక్ సినర్ ఓడించాడు. టెన్నిస్ లెజెండ్ జకోవిచ్‌ను 6-1, 6-2, 6-7 (6/8), 6-3తో ఓడించి మొదటి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు జనిక్ చేరుకున్నాడు.
సెమీస్‌లో నొవాక్ జకోవిచ్ వరుసగా తొలి రెండు సెట్లను 1-6, 2-6 తేడాతో కోల్పోయాడు. 22 ఏళ్ల యువ ప్లేయర్ జనిక్ సినర్ ఆట ముందు.. జకో ఏ నిలవలేకపోయాడు. మూడో సెట్‌లో పోరాడిన జకోవిచ్ 7-6 (8/6)తో రేసులో నిలిచాడు. అయితే నాలుగో సెట్‌లో విజృంభించిన సినర్.. 6-3తో సెట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2018 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్‌కి ఇది మొదటి ఓటమి. అంతేకాదు మెల్‌బోర్న్ పార్క్‌లో జొకోవిచ్ రికార్డు (33) మ్యాచ్‌ల విజయ పరంపరను సిన్నర్ ముగించాడు.
Also Read: Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్.. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య!
ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 29 అనవసర తప్పిదాలు చేయగా.. సిన్నర్ కేవలం ఎనిమిది మాత్రమే చేశాడు. జకోవిచ్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా.. సినర్ ఒక్కసారి మాత్రమే చేశాడు. మరో సెమీస్‌లో డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జెరెవ్‌లో ఎవరు గెలిస్తే.. వారితో జనిక్ సినర్ టైటిల్ కోసం పోటీపడతాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ఆదివారం జరగనుంది.