NTV Telugu Site icon

Jani Master: వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ.. దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ

Jani Master

Jani Master

Jani Master Diwali Celebrations: జానీ మాస్టర్.. గత రెండు నెలలుగా ఈ పేరు తెగ వినపడుతున్న విషయం తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే ఓ మహిళ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయిన జాని.. ఈ మధ్యనే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇక జైలు నుంచి విడుదలైన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఎక్కువగా ఆయన తన కుటుంబ సభ్యులతోనే సమయం కడుగుతున్నట్లు సమాచారం. ఈ మధ్యనే పండగను చేసుకోవడానికి జానీ తన కుటుంబంతో కలిసి నెల్లూరుకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కాస్త ఘనంగానే దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేశారు.

Read Also: Dua Padukone Singh: కూతురికి నామకరణం చేసిన రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులు.. పేరేంటంటే?

ఈ పోస్టులో అతడు తన కుటుంబం దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. వాళ్ల కేరింతలే మన సంతోషం అంటూ రాసుకోవచ్చాడు. ఈ పండుగనాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి అంటూ రాసుకోవచ్చాడు.

జానీ మాస్టర్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే.. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ ద్వారా ఆయన అభిమానులు, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు జానీ మాస్టర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరైతే జానీ మాస్టర్ ఇలా సంతోషంగా చూసి చాలా రోజులైంది అంటూ కామెంట్స్ చేశారు.

Show comments