NTV Telugu Site icon

Janhvi Kapoor-NTR: నాకు 10 రోజులు పడితే.. ఎన్టీఆర్‌కు సింగిల్ సెకనే: జాన్వీ కపూర్‌

Janhvi Kapoor Ntr

Janhvi Kapoor Ntr

Janhvi Kapoor Heap Praise on Jr NTR: బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ‘ఉలఝ్‌’ షూటింగ్ పూర్తి చేసిన జాన్వీ.. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘దేవర’ కాగా.. రెండోది ‘ఆర్‌సీ 16’. కొరటాల శివ, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్‌, జాన్వీలు ఓ సాంగ్ షూటింగ్ పూర్తి చేశారు. ఆ షూటింగ్ వివరాలను పంచుకున్న జూనియర్‌ శ్రీదేవి.. ఎన్టీఆర్‌లపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి డ్యాన్స్‌ స్టెప్‌ను అయినా ఇట్టే వేస్తారని, ఏ విషయాన్ని అయినా సెకనులో నేర్చుకోగలరని చెప్పారు.

బాలీవుడ్‌ చిత్రం ఉలఝ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ… ‘నేను దేవరలో నటిస్తున్నా. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎనర్జిటిక్‌ హీరో. ఆయన రాగానే సెట్‌కు కళ వస్తుంది. అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇటీవలి షెడ్యూల్‌లో మా ఇద్దరిపై పాటను చిత్రీకరించారు. ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ వేసే వేగాన్ని చూసి ఆశ్చర్యపోయా. ఎన్టీఆర్‌ ఒక్క సెకనులోనే ఎలాంటి డ్యాన్స్‌ స్టెప్‌ను అయినా నేర్చుకోగలరు. నాకు మాత్రం 10 రోజులు పడుతుంది. తర్వాత పాట షూటింగ్‌ కోసం నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ చేస్తున్నా’ అని తెలిపారు.

Also Read: Paris Olympics 2024: నేనెంతగానో మెరుగయ్యా.. నా ఆటను కోర్టులో చూస్తారు: సింధు

‘తెలుగు వారి పనితీరు నాకు చాలా ఇష్టం. వారు కళను, సినిమాను చాలా గౌరవిస్తారు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. కథపై నమ్మకంతో పని చేస్తారు. డైరెక్టర్ కొరటాల శివ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయమైనా సున్నితంగా చెబుతారు. ఆయనతో కలిసి పనిచేయడం సులభం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నా తల్లిదండ్రులు నేర్పారు. నా తల్లిదండ్రులతో పాటు అభిమానులు గర్వపడేలా ఉంటాను. ప్రస్తుతం సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇటీవల అనారోగ్యంకు గురై కాస్త ఇబ్బంది పడ్డాను. ప్రస్తుతం కోలుకుంటున్నా’ అని జాన్వీ కపూర్‌ చెప్పుకొచ్చారు.

Show comments