బాలీవుడ్‌లో టాలెంట్, గ్లామర్‌తో పాటు తన స్పష్టమైన అభిప్రాయాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఇటీవల మరోసారి ధైర్యంగా మాట్లాడిన మాటలతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరిగిన మహిళా శక్తి, సమానత్వంపై ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన జాన్వీ, సినీపరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ముఖ్యంగా పురుష అహంకారం ఇంకా ఎంత బలంగా ఉందో వివరించారు.
Also Read : Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్
జాన్వీ మాట్లాడుతూ.. “నేను ఒక మహిళగా పుట్టినందుకు అత్యంత గర్వంగా ఉంది. మహిళలు బలహీనులు కాదు.. వారు శక్తి మరియు సాహసం కలిగినవారు. సమానత్వం గురించి మాట్లాడితేనే మార్పు మొదలవుతుంది. నలుగురు మహిళల మధ్య నా అభిప్రాయం నేరుగా చెప్పగలను. కానీ నలుగురు పురుషులు ఉన్నచోట చాలా జాగ్రత్తగా, వాళ్లు నొచ్చుకోకుండా మాట్లాడాలి. ఈ ఇండస్ట్రీలో మహిళగా ఉన్న నేను ఈ విషయంలో ఎన్ని సార్లు నలిగిపోయానో నాకు తెలుసు” అని తెలిపింది. ఈ మాటలు అనేక మహిళలకు కూడా తన అనుభవాన్ని గుర్తు చేశాయి.
జాన్వీ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, ఈ విషయంపై గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా స్పందించడం మొత్తం చర్చను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జాన్వీ వీడియోను రీ-షేర్ చేస్తూ.. “ఇలా మాట్లాడే అమ్మాయిలకు మనం మద్దతు ఇవ్వాలి. ఇలాంటి మాటలు మార్పులు తొలిమెట్టు” అని రాసింది. ప్రియాంక ఈ స్పీచ్‌కు సపోర్ట్ ఇవ్వడం, జాన్వీకి కాదు, మొత్తం మహిళల కోసం ఒక పాజిటివ్ సిగ్నల్‌గా మారింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో #JanhviKapoor #PriyankaChopra హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ అనేక సెలబ్రిటీలు, అభిమానులు తమ అభిప్రాయాలు రాస్తున్నారు. “ఈ వాయిస్‌లు పెరిగినప్పుడే ఇండస్ట్రీ మారుతుంది”, “ఇద్దరు స్టార్‌ల ధైర్యం నిజంగా ఇన్స్పిరేషన్” వంటి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. జాన్వీ మాటలు కేవలం ఒక ప్రసంగంగా కాకుండా, ఇండస్ట్రీలో మహిళల కోసం ఒక కొత్త చర్చకు దారితీశాయి.
