బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా విడుదల కాబోతుంది.. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది.. బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో నటిస్తుంది..
ఇక ఈ మధ్య జాన్వీ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ మధ్య మైదాన్ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అంతేకాదు జాన్వీ తండ్రీ బోణి కపూర్ కూడా శిఖర్ పై ఓ సందర్బంలో ప్రశంసలు కురిపించాడు.. దాంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి.
అంతేకాదు త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఇటీవల జాన్వీ బ్యాచిలరేట్ పార్టీని చేసుకుంది.. ఆ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ రాధికా మర్చంట్ బ్యాచిలరేట్ పార్టీని నిర్వహించింది.. ఆ పార్టీలో దిగిన ఫొటోలే ఇవి.. అనంత్ అంబానీ కూడా ఆ పార్టీలో ఉన్నారు.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే..