NTV Telugu Site icon

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!

Janhvi Kapoor Dating

Janhvi Kapoor Dating

Janhvi Kapoor Work Hard For Mr and Mrs Mahi Movie: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శరణ్‌ శర్మ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మే 31న విడుదల కానుంది. ఈ సినిమా కోసం జాన్వీ బాగా కష్టపడింది.

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహిలో జాన్వీ కపూర్‌ క్రికెటర్‌గా కనిపించనున్నారు. గతంలో బ్యాట్ పట్టని జాన్వీ కోసం చిత్రబృదం ఓ ప్రత్యేక క్యాంపును కూడా ఏర్పాటు చేసింది. టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద జాన్వీ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నారు. ప్రాక్టీస్ సమయంలో ఆమెకు భుజం గాయం అయింది. కొన్ని రోజులు చికిత్స తీసుకుని.. మళ్లీ సాధన చేశారు. నెట్ సెషన్‌లో ఆమె తీవ్రంగా శ్రమించారు. చివరకు జాన్వీ భారీ షాట్లు ఆడారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా కోసం జాన్వీ ఇంతలా కష్టపడిందా? అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: SRH vs RR Qualifier 2: హైదరాబాద్, రాజస్తాన్‌ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్, వాతావరణం డీటెయిల్స్!

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. మొదటి సినిమా ‘ధడక్‌’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంజన్ సక్సేనాతో తనలోని నటిని పరిచయం చేశారు. రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, దోస్తానా 2తో స్టార్ అయ్యారు. జాన్వీ టాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన దేవరలో తంగం పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు-రామ్‌ చరణ్‌ల సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించనున్నారు.

Show comments