బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ తన కెరీర్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా, తన గతం గురించి కొన్ని చేదు నిజాలను పంచుకున్నారు. ఒకప్పుడు తాను మద్యానికి ఎలా బానిసయ్యానో, ఆ వ్యసనం నుంచి బయటపడటానికి ఎంత కష్టపడ్డానో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సులో జాన్వీ మాట్లాడుతూ..
Also Read: Nagababu-Prakash Raj: రాముడిపై విషం చిమ్మితే గతి అంతే! ప్రకాష్ రాజ్‌కు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
‘మద్యానికి బానిసైన వ్యక్తులను నేరస్థుల్లా చూడకండి. అదొక మానసిక ఆరోగ్య సమస్య. ఒత్తిడి, ఆందోళనల వల్ల చాలామంది వ్యసనాల బారిన పడతారు. సమాజం వారిని వెలివేయకుండా, ప్రేమతో దగ్గరకు తీస్తేనే వారు త్వరగా కోలుకుంటారు. ఎందుకంటే మద్యపానం నా జీవితంలో ఒక విలన్‌లా తయారైంది. అప్పుడప్పుడు సరదాగా మొదలైన ఈ అలవాటు, నాకు తెలియకుండానే నన్ను బానిసను చేసేసింది. ప్రతిరోజూ ఉదయం హ్యాంగోవర్‌తో లేవడం, ఆ వాసన అంటేనే అసహ్యం వేయడం మొదలైన తర్వాతే నాకు జ్ఞానోదయం అయింది. వ్యసనం అనేది మనతో ఎవరో తెలియని అపరిచిత వ్యక్తి సహవాసం చేస్తున్నట్లే ఉంటుంది. దానివల్ల మన బంధువులు, స్నేహితుల దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్య వల్ల కలిగే నష్టాలు తెలిసిన తర్వాతే నేను పూర్తి అవగాహన పెంచుకున్నాను’ అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో పాటు, రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) లో నటిస్తున్నారు. తన తల్లి శ్రీదేవి కోరిక మేరకు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు.
