Site icon NTV Telugu

Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా టాప్ ప్రొడ్యూసర్..!

Raam

Raam

Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరిను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు అధ్యక్షుడు పవన్ ప్రకటన విడుదల చేశారు. “జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరిని నియమిస్తున్నాను. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్వర్తిస్తారు. పార్టీ కోసం పని చేస్తానని 2014లోనే ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఎటువంటి ఆపేక్ష లేకుండా పార్టీ పట్ల ఎంతో అంకిత భావాన్ని కనబరుస్తూ, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. పార్టీ తెలంగాణ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సాఫ్ట్ వేర్ నిపుణుడైన ఆయన సాఫ్ట్ వేర్ సంస్థల యజమానిగా ఉన్నారు. రామ్ తాళ్ళూరికి ఉన్న సంస్థాగత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడమైనది.” అని పేర్కొన్నారు. అయితే.. రామ్ తాళ్లూరి తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత. ఆయన తొలి చిత్రం “చుట్టాలబ్బాయి”. ఇది 2016లో విడుదలైంది. మార్చి 2018లో తెరపైకి వచ్చిన కన్నడ భాషా క్రైమ్ థ్రిల్లర్ “దండుపాళ్యం 3”ని నిర్మించారు. రామ్ మొదట్లో షార్టు ఫిలిమ్‌లు రూపొందించి తన కెరీర్‌ను ప్రారంభించారు.

REDA MORE: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ భార్య సంచలన ఆరోపణలు

Exit mobile version