Janasena: తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన.. ఏ జిల్లాలో గెలిచిందంటే..?

Janasena

Janasena

Janasena: ఏపీకే పరిమితమైందని భావించిన జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు. 14వ వార్డులో జనసేన తరఫున పోటీ చేసిన విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుపై ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కాగా.. ఈ మున్సిపాలిటీలో మొత్తం 15 స్థానాలకు గానూ 9 వార్డుల్లో కాంగ్రెస్‌, 5 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందగా, ఒక వార్డును జనసేన దక్కించుకుంది. అయితే.. విజయ లక్ష్మీ గెలపుతో తెలంగాణలోని జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో ఇప్పటివరకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొత్త శక్తిగా ఎదగాలని చూస్తున్న జనసేనకు ఈ గెలుపు ప్రోత్సాహాన్ని ఇస్తోందని అభిమానులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయా? అనే అంశాన్ని జనసేన పార్టీ నిర్ణయించాలి.

READ MORE: 8000mAh బ్యాటరీ, 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో TECNO POVA Curve 2 5G లాంచ్.. ధర ఎంతంటే?