కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి జననాయగన్ రిలీజ్ వాయిదా వ్యవహారం తమిళ నాట సంచలనంగా మారింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. దాంతో కోర్టు మెట్లెక్కారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్ర సెన్సార్ సర్టిఫికెట్‌కు సంబంధించి దాఖలైన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సర్టిఫికేషన్ అంశంపై కోర్టు మెట్లెక్కిన తర్వాత ఇప్పుడు వ్యూహంలో నిర్మాతలు ఇప్పడు మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read : Dhanush : ధనుష్ కొడుకు ‘యాత్ర రాజా’ వెండితెర ఎంట్రీ
కేసు తదుపరి విచారణకు వచ్చినప్పుడు, దీనిని ఉపసంహరించుకుంటున్న విషయాన్ని సింగిల్ జడ్జి ముందు అధికారికంగా తెలియజేయనున్నట్లు ప్రొడక్షన్ టీమ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం జన నాయగన్ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్‌పై ఉన్న అన్ని న్యాయ పరమైన చిక్కులు తొలగుతుతాయి. కోర్టు కేసు ఉపసంహరణ తర్వాత ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపనున్నారు. కమిటీ ద్వారా మరోసారి పూర్తి స్థాయి సమీక్ష జరగనుండగా, ఈ ప్రక్రియకు సుమారు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఈ కమిటీ పరిశీలన ఆధారంగా, గత వెర్షన్‌తో పోలిస్తే మరిన్ని సీన్స్ ను కత్తెర వేయడం లేదా డైలాగ్‌లకు ఆడియో మ్యూట్స్ సూచించే అవకాశం ఉంది. ఈ తాజా పరిణామాలతో జన నాయగన్ విడుదల తేదీపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రివైజింగ్ కమిటీ నిర్ణయాల తర్వాతనే జన నాయగన్ రిలీజ్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
