తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, నరైన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టగా ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది.
విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. అలా ఓపెన్ చేసిన 24 గంటల్లోనే జన నాయగన్ 12.7 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యి తమిళ సినీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆయితే యుకేలో అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో 24 గంటల్లో 10 వేల టికెట్లతో టాప్ లో ఉంది. ఇప్పుడు విజయ్ నటించిన జన నాయగన్ భారీ స్థాయి బుకింగ్స్ తో లియో రికార్డు బద్దలు కొట్టింది. విజయ్ నటించబోయే చివరి సినిమాకవడంతో ఎలాగైనా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా ఎదురుచూస్తున్నారో ఈ బుకింగ్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇంతటి భారీ అంచనాలు మధ్య 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది జననాయగన్.
