Site icon NTV Telugu

Jana Sena: యువకుడి హత్యకేసులో అరెస్ట్.. జనసేన మహిళా నేతపై వేటు..

Vinutha Kota

Vinutha Kota

Jana Sena: శ్రీకాళహస్తికి చెందిన ఓ యువకుడు చెన్నైలో దారుణ హత్యకు గురుకావడం కలకలం రేపింది.. ఈ హత్య కేసులో శ్రీకాహస్తి జనసేన ఇంఛార్జ్‌ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు తమిళనాడు పోలీసులు.. ఈ నేపథ్యంలో జనసేన నుంచి వినుత కోటను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది జనసేన అధిష్టానం.. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది.. ఆమెపై చెన్నైలో హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి.. ఈ క్రమంలో వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది..

Read Also: MLC Kavitha : ఇది పనిచేసే ప్రభుత్వం కాదు.. వెంటే ఉండి పని చేయించుకోవాల్సిందే..!

ఇక, తిరుపతిలో మీడియాతో మాట్లాడిన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు పసుపు లేటి హరిప్రసాద్.. పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలు వినుతా పాల్పడుతోంది‌.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లడంపై పార్టీ చర్యలు తీసుకుంది.. హత్య నేరంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం రావడంతో అమెను పార్టీ నుంచి బహిష్కరించామని వెల్లడించారు.. మరోవైపు ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. వినుత హత్య కేసుకు సంబంధించిన పార్టీ పెద్దలకు విషయం తెలిసి పార్టీ నుండి బహిష్కరించాం.. పార్టీ వ్యతిరేక, విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వినుతపై హత్య చేసినా అభియోగం వచ్చింది… ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై మాకు ఇంకా సమాచారం లేదు.. కానీ, వినుతను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

Exit mobile version