తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు. విజయ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా కథ, స్క్రీన్‌ప్లే ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, వారి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
Also Read : Roshan Kanakala: రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పిన రోషన్ కనకాల..
‘జన నాయగన్’ను పొంగల్ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడమే కాకుండా, ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మలచాలని మేకర్స్ గట్టి ప్లానింగ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తోంది, ఐమాక్స్ రిలీజ్ నిజమైతే ఎలాంటి సంచలనం అవుతుందో చూడాలి.
