Site icon NTV Telugu

Jana nayagan- Vaa vathiy ‘జన నాయగన్’ అవుట్ తో..కార్తీకి గోల్డెన్ ఛాన్స్?

Vavathiyaer, Jananayagan

Vavathiyaer, Jananayagan

ఈ మధ్య కాలంలో సినిమాలు వాయిదా పడటం కామన్ అయిపోయింది. అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కూడా థియేటర్‌లో విడుదల అయ్యేంత వరకు నమ్మకం లేకుండా పోయింది. దీనికి నిదర్శనం బాలయ్య ‘అఖండ 2’ సినిమా విడుదలకు ఇంకో గంట టైం ఉంది అనగా వాయిదా పడి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర కూడా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 9న రిలీజ్ కావాల్సిన దళపతి విజయ్ భారీ చిత్రం ‘జన నాయగన్’ కి చివరి నిమిషంలో కొన్ని చిక్కులు ఎదురవ్వడంతో, మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో ఉండగా, ఇదే సమయాన్ని టాలెంటెడ్ హీరో కార్తీ వాడుకోవాలని చూస్తున్నారు. కార్తీ నటించిన ‘వా వాథియర్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) చిత్రాన్ని ఈ సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని కోలీవుడ్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

Also Read :Shivaji-Anasuya : సడన్‌‌గా శివాజీ విషయంలో రూట్ మార్చిన అనసూయ.. వీడియో వైరల్

ఒకవేళ ‘జన నాయకుడు’ ఈ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకుంటే, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు కార్తీ సినిమాకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పటికే సంక్రాంతి రేసులో ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు ఉండగా, ఇప్పుడు తమిళం నుంచి ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. జన నాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ కార్తీ మాత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వేటలో దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Exit mobile version