Site icon NTV Telugu

Jana Nayagan: థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డేట్ ఫిక్స్?

Jananayagan

Jananayagan

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా, మన తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ కి అధికారిక రీమేక్ అని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయకముందే, దీని ఓటిటి రిలీజ్ డేట్ గురించి నెట్టింట ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

Also Read :  Varanas : పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

తాజా సమాచారం ప్రకారం, ‘జన నాయగన్’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన నెల రోజుల్లోపే అంటే ఫిబ్రవరి 6 నుంచే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం ఆరు వారాల గ్యాప్ ఉంటుంది, కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నాలుగు వారాలకే ఓటిటిలోకి వచ్చేస్తుందని వినిపిస్తున్న వార్త ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version