Site icon NTV Telugu

Ranji Trophy 2026 Final: జమ్మూకాశ్మీర్ సంచలనం.. 67 ఏళ్ల తర్వాత మొదటిసారి రంజీ ట్రోఫీ కైవసం

Ranji Trophy

Ranji Trophy

Ranji Trophy 2026 Final: హుబ్లీ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టు కర్ణాటకపై చారిత్రాత్మక ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మెగా టోర్నీలో జమ్మూకాశ్మీర్ జట్టు 67 ఏళ్ల తర్వాత మొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుభమ్ పుండిర్ తన సెంచరీతో మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఆ తర్వాత ఔకిబ్ నబీ ఐదు వికెట్లు తీయడం J&K 291 పరుగుల ఆధిక్యాన్ని సాధించడంలో సహాయపడింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన ఈ నిర్ణయాత్మక పోరులో జమ్మూకాశ్మీర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి సత్తా చాటింది. మొదటి ఇన్నింగ్స్‌లో జే అండ్ కే ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టులో శుభమ్ పుండిర్ 121 పరుగులతో అద్భుత సెంచరీ బాదగా, యావర్ హసన్ (88), సాహిల్ లోత్రా (72), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), కన్హయ్య వాధావన్ (70) అర్ధసెంచరీలతో కీలక పాత్ర పోషించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో రాణించినప్పటికీ, మిగితా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.

READ ALSO: Tomato Market price: తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయిన టమాటా ధరలు

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక జట్టు జమ్మూకాశ్మీర్ బౌలర్ల ధాటికి తలవంచింది. కేవలం 293 పరుగులకే కర్ణాటక జట్టు కుప్పకూలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, ఇతర స్టార్ ఆటగాళ్లు కె.ఎల్. రాహుల్ (13), దేవదత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0) విఫలమయ్యారు. జమ్మూకాశ్మీర్ బౌలర్లలో ఆకిబ్ నబీ 5 వికెట్లతో కర్ణాటక బ్యాటింగ్ వెన్నువిరిచాడు. దీనితో జమ్మూకాశ్మీర్‌కు 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా జమ్మూకాశ్మీర్ నిలకడగా ఆడి 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ 160 పరుగులతో అజేయంగా నిలిచి కర్ణాటక బౌలర్లను విసిగించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో జట్టు భారీ స్కోరుకు పునాది వేసిన శుభమ్ పుండిర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. హుబ్లీ మైదానంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

READ ALSO: Israel-Iran War: యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు..

Exit mobile version