Site icon NTV Telugu

JK: “తినేది భారత్‌ సొమ్ము.. పని చేసేది పాక్‌ కోసం..” ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు…

Kashmir Terrorism

Kashmir Terrorism

Jammu Kashmir govt employees sacked: జమ్మూ కశ్మీర్ కి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఈ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. వీరు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని దర్యాప్తులో తేలింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి) ని ఉటంకిస్తూ.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఉద్యోగలను తొగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ నిందితులను కుప్వారాలోని కర్నాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఖుర్షీద్ అహ్మద్ రాథర్‌గా, అసిస్టెంట్ పశుసంవర్ధకుడు (గొర్రెల పెంపకం విభాగం) సియాద్ అహ్మద్ ఖాన్‌గా గుర్తించారు.

READ MORE: Sahasra M*rder Case : మిషన్ డాన్.. లెటర్ రాసుకుని.. గొంతులో పొడిచి.. పొడిచి..

ఖుర్షీద్ అహ్మద్ రాథర్ ఎవరు?
ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్న ఖుర్షీద్ అహ్మద్ రాథర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఖుర్షీద్ 2003లో ప్రభుత్వ సేవలో (తాత్కాలికంగా రహ్బర్-ఎ-తలీమ్ కింద) నియమితులయ్యాడు. 2008 నుంచి విధులు కొనసాగిస్తున్నాడు.. ఖుర్షీద్ లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు OGWగా పనిచేస్తున్నారు. యువతకు విద్యను అందించడానికి, తన విధిని నిర్వర్తించడానికి ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నాడు ఖుర్షీద్. మరోవైపు.. ఎల్‌ఇటి ఉగ్రవాద కార్యకలాపాలకు చురుకైన మాధ్యమంగా పని చేశాడు. లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాదులకు ఖుర్షీద్‌ను ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను సరఫరా చేసేవాడని తేలింది. అతను ఉగ్రవాద హ్యాండర్లు మంజూర్ అహ్మద్ షేక్ అలియాస్ షకూర్, జావిద్ అహ్మద్‌లతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఖుర్షీద్, అతని సహచరులను నుంచి 5 AK టైప్ (షార్ట్), MP 5 రైఫిల్స్, 1 AK-47 రైఫిల్, 2 పిస్టల్స్, 5 MP, 5 మ్యాగజైన్స్, 2 పిస్టల్ మ్యాగజైన్స్, 1 AK-47 మ్యాగజైన్, 20 AK-47 రౌండ్లు వంటి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

READ MORE: CM Chandrababu: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. మేం ఎలా మద్దతిస్తాం..?

సియాద్ అహ్మద్ ఖాన్ ఎవరు?
సియాద్ అహ్మద్ ఖాన్ వృత్తిరీత్యా అసిస్టెంట్ యానిమల్ కీపర్. సియాద్ 2004లో గొర్రెల పెంపకం విభాగంలో అసిస్టెంట్ యానిమల్ కీపర్‌గా నియమితులయ్యాడు. అతను ఇష్టపూర్వకంగా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కోసం పనిచేయడం ప్రారంభించాడు. సియాద్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించి, వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేవాడు. సియాద్ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించడానికి మాదకద్రవ్యాలను కూడా అక్రమంగా రవాణా చేయడం ప్రారంభించాడు. జనవరి 12, 2024న కుప్వారా కేరన్‌లోని పీర్ బాబా దర్గా వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యంలోని నాకా పార్టీ సియాద్‌ను ఆపి అరెస్టు చేసి అరెస్టు చేసిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అతడి నుంచి ఒక AK-47 స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు దాన్ని అప్పగించేందుకు తీసుకెళ్తు్న్నట్లు గుర్తించారు. అతని సహచరుడు రఫాకత్ అహ్మద్ ఖాన్ నుంచి ఒక పిస్టల్, ఒక పిస్టల్ మ్యాగజైన్, 5 పిస్టల్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో సియాద్ ఖాన్ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ బషరత్ అహ్మద్ ఖాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని, సియాద్ ఖాన్, అతని సహచరుల ద్వారా ఎల్‌ఓసీ కంచె సమీపంలోని కేరన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేవాడని తేలింది.

Exit mobile version