NTV Telugu Site icon

James Anderson: విజయంతో కెరీర్ ముగించిన జేమ్స్ అండర్సన్..

Anderson

Anderson

లార్డ్స్‌ టెస్టులో వెస్టిండీస్ పై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 371 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది. కాగా.. ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన జట్టు విజయంలో హీరోగా మారాడు. ఈ మ్యాచ్‌లో అట్కిన్సన్ మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. గస్ అట్కిన్సన్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. 1976 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు.

Shabbir Ali: కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్‌

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ విజయంతో జేమ్స్ అండర్సన్ కెరీర్ కూడా ముగిసింది. ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌కి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. జేమ్స్ ఆండర్సన్ కెరీర్ 22 సంవత్సరాలు కొనసాగింది. ఈ ఆటగాడు 2002లో అరంగేట్రం చేశాడు. 2003లో జింబాబ్వేపై తొలి టెస్టు ఆడాడు. అండర్సన్ తన కెరీర్‌లో 188 టెస్టులు ఆడి 704 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 700కు పైగా వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ అండర్సన్ నిలిచాడు. అలాగే.. వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.

Rahul Gandhi: స్మృతీ ఇరానీ పట్ల అసహ్యంగా ప్రవర్తించొద్దు.. కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి..

లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత.. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించలేదు. అయినప్పటికీ 371 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రౌలీ 89 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఒలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50 పరుగులు చేశారు. తొలి టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ జామీ స్మిత్ 70 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్‌ జట్టు విఫలమైంది. కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.