పంజాబ్లో ఓ ఏఎస్సై యువకులపై దురుసుగా ప్రవర్తించారు. ఏఎస్సై జస్వీందర్ సింగ్ భోగ్‌పూర్లో ఇద్దరు యువకులపై అందరూ చూస్తుండగానే తీవ్రంగా కొట్టాడు. కాగా.. అక్కడున్న కొందరు స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యువకులను తీవ్రంగా కొట్టడం.. వారు వద్దు వదిలిపెట్టండని వేడుకుంటున్న బూటు కాళ్లతో తన్నడం అందులో చూడవచ్చు.
Mamata Banerjee: ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి.. పోలీసులకు అల్టిమేటం
పోలీసు యూనిఫాంలో ఉన్న ఏఎస్‌ఐ యువకులను పదే పదే కొట్టడాన్ని బాటసారులు భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ ప్రాంతంలో పోలీసుల ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. కాగా.. ఈ వీడియోను దాడిలో గాయపడ్డ యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాము ఎలాంటి తప్పు చేయకుండా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏఎస్సై వారిపై దాడి చేయడంతో యువకుల ముఖాలకు గాయాలయ్యాయి.
Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
ఈ ఘటనపై స్పందించిన జలంధర్ రూరల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సుమిత్ సూద్.. వేరొక విషయాన్ని చెప్పారు. శనివారం సాయంత్రం ASI జస్వీందర్ సింగ్ భోగ్‌పూర్‌లోని చెక్‌పాయింట్‌లో పోలీసు బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారని.. అయితే ముగ్గురు యువకులు బైక్ పై చెక్‌పాయింట్ వద్దకు వచ్చారన్నారు. వారిని ఆపమని అడిగితే.. యువకులు పోలీసులపై దుర్భాషలాడుతూ అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించారని డీఎస్పీ పేర్కొన్నారు. దీంతో.. ఏఎస్సై జస్వీందర్ యువకులను వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో.. యువకులు ఏఎస్సై పై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. తనను తాను రక్షించుకునేందుకు ఇలా చేశాడని డీఎస్పీ తెలిపారు.