Site icon NTV Telugu

Jakkampudi Ganesh: పవన్ కళ్యాణ్ మాటలతో చాలా భాధపడ్డాం.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి!

Jakkampudi Ganesh

Jakkampudi Ganesh

2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ కుటుంబం క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తాము చాలా భాధపడ్డాం అని వైసీపీ నేత జక్కంపూడి గణేష్ తెలిపారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్‌ల మీద తమపై చేసిన ఆరోపణలు నిరూపించమని ప్రశ్నిస్తున్నామన్నారు. తమపై ఆరోపణలు రుజువు చేయండి, లేదంటే చేతగాని వాళ్లమని ఒప్పుకోండన్నారు. తమ క్యారెక్టర్‌పై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుందని జక్కంపూడి గణేష్ హెచ్చరించారు.

Also Read: TV Rama Rao: జనసేన ఇంచార్జి పదవి నుంచి టీవీ రామారావు ఔట్!

కాకినాడలో వైసీపీ నేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ… ‘జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వస్తే.. తమ హవా ఉండదని ఎమ్మెల్యేలు బత్తుల, పంతం నానాజీ కంగారు పడుతున్నట్లు ఉన్నారు. మా అన్నయ్య జనసేనలో చేరాలని కోరినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ప్రచారంలో మా కుటుంబం క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు మేం భాధపడ్డాం. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్‌ల మీద మాపై చేసిన ఆరోపణలు నిరూపించమని ప్రశ్నిస్తున్నాం. మాపై ఆరోపణలు రుజువు చేయండి, లేదంటే చేతగాని వాళ్లమని ఒప్పుకోండి. మా క్యారెక్టర్‌పై పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి’ అని హెచ్చరించారు.

Exit mobile version