Myke Tyson vs Jake Paul Fight: యూట్యూబర్ బాక్సర్‌గా మారిన 27 ఏళ్ల జేక్ పాల్ ప్రముఖ బాక్సర్‌లలో ఒకరైన 58 ఏళ్ల మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్‌ను ఓడించాడు. డల్లాస్ కౌబాయ్స్ హోమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 27 ఏళ్ల జేక్ పాల్ కీలక మ్యాచ్‌లో టైసన్‌ను ఓడించాడు ఏకగ్రీవ నిర్ణయంతో జేక్ పాల్ గెలిచాడు. మ్యాచ్ ఆశించిన స్థాయిలో ఉత్కంఠగా సాగలేదు. మ్యాచ్‌కు ముందు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కానీ, మ్యాచ్ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం కనిపించింది. ఆఖరి గంట మోగడానికి ముందు, పాల్ కూడా టైసన్‌కు వంగి గౌరవం ఇచ్చాడు.
20 ఏళ్ల తర్వాత బరిలోకి టైసన్
న్యాయనిర్ణేతలు 80–72, 79–73, 79–73 తేడాతో జేక్ పాల్‌ను విజేతగా ప్రకటించారు. టైసన్ ప్రారంభంలో దూకుడు వైఖరిని అవలంభించాడు. కొన్ని మంచి పంచ్‌లు చేశాడు, కానీ మిగిలిన సమయంలో టైసన్ పెద్దగా దాడి చేయలేకపోయాడు. 58 ఏళ్ల టైసన్ తన 20 ఏళ్ల కెరీర్‌లో మొదటి సారి ప్రొఫెషనల్ ఫైట్‌లో పెద్దగా ఏమీ ప్రభావం చూపలేకపోయాడు. ఆరంభం తర్వాత పాల్ మరింత దూకుడుగా కనిపించాడు, కానీ అతని పంచ్‌లు అంత ప్రభావవంతంగా లేవని నిరూపించాడు. ఇద్దరి మధ్య వయసు తేడా స్పష్టంగా కనిపించింది.బౌట్ అనంతరం మైక్ టైసన్, జేక్ పాల్ మామూలుగానే అభివాదం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. 2005లో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత మైక్ టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిగిన బౌట్‌లో తలపడటం కోసం మైక్ టైసన్ సుమారు రూ.168 కోట్లు, జేక్ పాల్ దాదాపు రూ.337 కోట్లు పొందనున్నట్లు సమాచారం. ఈ పోరాటం వాస్తవానికి జూలై 20న జరగాల్సి ఉంది, అయితే టైసన్ అనారోగ్యం కారణంగా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది. టైసన్ కడుపులో పుండుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు.