NTV Telugu Site icon

Jaipur Express Firing: జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ ఇతడే.. కారణం ఏంటో తెలుసా?

Rpf Jawan

Rpf Jawan

Jaipur Express Firing Accused RPF Constable Chetan Singh Pics Goes Viral: ఈరోజు ఉదయం జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జైపుర్‌ నుంచి ముంబై వెళ్తున్న జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని బీ5 కోచ్‌లో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు జరిపాడు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్‌ స్టేషన్‌ దాటిన తర్వాత ఉదయం 5 గంటల సమయంలో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐతో పాటు ముగ్గురు ప్రయాణికులు అక్కడిక్కడే చనిపోయారు.

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్ ముందుగా సీనియర్ అధికారి, ఏఎస్‌ఐ టీకా రామ్‌ మీనాను కాల్చి చంపాడు. తర్వాత మరో బోగీలోకి వెళ్లి.. ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దాంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం చేతన్‌ సింగ్.. దహిసర్‌ స్టేషన్‌ వద్ద రైలు నుంచి దూకి పారిపోయాడు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన హింసాత్మక సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేతన్‌ వద్ద ఉన్న ఆయుధాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: IND vs PAK: వన్డే ప్రపంచకప్‌ 2023​​.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్!

నిందుతుడు చేతన్ సింగ్‌కు సంబందించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే 30 ఏళ్ల చేతన్ సింగ్‌ ఈ హింసాత్మక సంఘటనకు పాల్పడానికి గల కారణాలు తెలియవచ్చాయి. నిందుతుడు ఇటీవలే గుజరాత్ నుంచి ముంబైకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. ఈ ట్రాన్స్‌ఫర్‌ కారణంగా అతడి కుటుంబంలో ఇబ్బందులు తలెత్తాయట. కొత్త పోస్టింగ్‌పై ఆగ్రహంగా ఉన్న చేతన్.. మానసికంగా కూడా సతమతమవుతున్నాడట. మానసిక ఒత్తిడికి గురైన అతడు.. పై అధికారితో సహా ముగ్గురి ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నలుగురి మృతదేహాలను కందివాలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు.

Also Read: Rohit-Chahal: చహల్‌ను చితకబాదిన రోహిత్‌.. పక్కనే కోహ్లీ! వీడియో వైరల్