NTV Telugu Site icon

Jayaprakash Narayan College of Engineering: అక్టోబర్ 11న జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు

Jp College

Jp College

మాజీ కేంద్ర మంత్రి, దివంగత సూదిని జైపాల్ రెడ్డి (S Jaipal Reddy) విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఈనెల 11వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (Jayapraksh Narayan College of Engineering)లో నిర్వహిస్తున్నట్టు జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఛైర్మన్ కె.ఎస్. రవి కుమార్ తెలిపారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 11వ తేదీ ఉదయం 9 గంటల 20 నిమిషాలకు జయప్రకాష్ నారాయణ 120 వ జయంతి సందర్భంగా ధర్మాపూర్ లోని కాలేజ్ ఆవరణలో జరుగుతుందని ఛైర్మన్ కె.ఎస్ రవికుమార్ తెలిపారు. ఈ విగ్రహావిష్కరణకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

Read Also: Rajiv Swagruha : 10 జిల్లాల్లో రాజీవ్ స్వగృహ 19 ఆస్తులు వేలం

ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఎస్ నిరంజన్ రెడ్డి హాజరవుతారు. వీరితోపాటు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఛైర్మన్ కె.ఎస్. రవి కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Read Also: Rajiv Swagruha : 10 జిల్లాల్లో రాజీవ్ స్వగృహ 19 ఆస్తులు వేలం