Jailer : ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 10 న థియేటర్లలో విడుదల అయి మొదటి షో నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ గా వసూళ్లు సాధించింది. తలైవా ఈ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మరియు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.జైలర్ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 650 కోట్లు రాబట్టింది..
సూపర్‌స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ అర్ధ రాత్రి తో ఈ నిరీక్షణకు తెరపడనుంది. కాసేపట్లోనే జైలర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే రజనీ బ్లాక్ బస్టర్ మూవీ అందుబాటులోకి రానుంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో జైలర్ స్ట్రీమింగ్ కానుంది. జైలర్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో రజనీ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.అయితే కొన్ని రోజుల క్రితం జైలర్ సినిమా ఆన్‌లైన్‌లో లీకైన విషయం తెలిసిందే. హెచ్‌డీ ప్రింట్ పలు పైరసీ వెబ్‌సైట్లలో కనిపించాయి.. దీంతో రజనీ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కూడా అప్పటికప్పుడు జైలర్ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేసింది. ఈ సినిమాను థియేటర్ లో విడుదల అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీ విడుదల చేయాల్సింది గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సినిమా ఫైరసీ కావడంతో ఇంక చేసేదేమి లేక ముందుగానే సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేస్తున్నారు.
Also Read
- Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
- Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
- Fish vs Chicken: ఫిష్ vs చికెన్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం? ఏది తినాలి? డాక్టర్ కీలక సూచనలు
- Indian Origin Cricketer: ఆ క్రికెటర్‌కు బిగ్‌షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
తాజావార్తలు
-
Sheikh Hasina: 2 ఏళ్ల తర్వాత పబ్లిక్‌లోకి షేక్ హసీనా.. కీలక ప్రకటన చేయనున్న మాజీ ప్రధాని
-
PoKలో PML-N జెండా.. షాబాజ్ షరీఫ్ ఇప్పుడు అన్నను ‘ప్రధాని’ చేస్తాడా?
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
-
Fish vs Chicken: ఫిష్ vs చికెన్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం? ఏది తినాలి? డాక్టర్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!