Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో తమిళ సినిమా చరిత్రలో మూడో అతిపెద్ద వరల్డ్‌వైడ్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘జైలర్ 2’ నిలిచింది.
‘జైలర్ 2’ తొలి రోజు భారత్‌లో రూ.59.70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇండియా గ్రాస్ రూ.70.25 కోట్లుగా నమోదవగా.. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.55 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు రూ.125.25 కోట్లకు చేరుకున్నాయి. అన్ని భాషల్లో కలిపి తొలి రోజు సినిమాకు 55.4% ఆక్యుపెన్సీ నమోదైంది. మొదటి రోజు ఏకంగా 37,46,734 మంది సినిమాను వీక్షించారు.
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
- Punam Raut Retires: "చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా".. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
భాషల వారీగా వసూళ్లు చూస్తే.. తమిళ వెర్షన్ ‘జైలర్ 2’ దేశీయ వసూళ్లలో అత్యధిక వాటాను అందుకుంది. తమిళంలో 9,326 షోల ద్వారా రూ.43.35 కోట్ల నెట్ వసూలు కాగా, 70.8% ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో 2,792 షోల ద్వారా రూ.12.50 కోట్ల నెట్ వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌కు 56.2% ఆక్యుపెన్సీ లభించింది. హిందీలో 4,371 షోల ద్వారా రూ.3.50 కోట్ల నెట్‌తో 22% ఆక్యుపెన్సీ నమోదైంది. కన్నడలో 110 షోల ద్వారా రూ.35 లక్షల నెట్ వసూలు కాగా, 54% ఆక్యుపెన్సీ నమోదైంది.
రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు నుంచి అత్యధికంగా రూ.24 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటకలో రూ.14.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో కలిపి రూ.14.50 కోట్ల గ్రాస్ వసూలైంది. కేరళ నుంచి రూ.12.50 కోట్లు రాగా.. మిగతా భారత మార్కెట్ల నుంచి రూ.4.75 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తంగా భారత్‌లో తొలి రోజు రూ.70.25 కోట్ల గ్రాస్ నమోదైంది. భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ ‘జైలర్ 2’ తమిళ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ రికార్డును అందుకోలేకపోయింది. రజినీకాంత్ నటించిన ‘కూలీ’ 2025లో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151.10 కోట్ల గ్రాస్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత విజయ్ నటించిన ‘లియో’ రూ.142 కోట్ల వరల్డ్‌వైడ్ ఓపెనింగ్‌తో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు రూ.125.25 కోట్లతో ‘జైలర్ 2’ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
‘జైలర్ 2’కు నెల్సన్ దిలీప్‌కుమార్ రచన, దర్శకత్వం వహించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించారు. రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా, ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ మరోసారి ఈ ఫ్రాంచైజీలో కనిపించగా.. హృతిక్ రోషన్ ‘రాడీ’ పాత్రలో ప్రత్యేకంగా కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆర్. నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. భారీ ఓపెనింగ్‌తో మొదలైన ‘జైలర్ 2’ రాబోయే రోజుల్లో ఇదే జోరును కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!