NTV Telugu Site icon

Amritpal Singh: జైలు నుంచి విక్టరీ సాధించిన అమృత్‌పాల్‌

Amuruyha

Amuruyha

పంజాబ్‌లో వేర్పాటువాది అమృత్‌పాల్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి విక్టరీ సాధించారు. జాతీయ భద్రతాచట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలులో ఉంటున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అమృత్‌పాల్‌కు ప్రజలు భారీ విజయాన్ని అందించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరాకు 1,96,279 ఓట్లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Ponguleti: బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవ్వడంతోనే బీజేపీకి సీట్లొచ్చాయి

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖాదూర్ సాహిబ్ స్థానం నుంచి కాంగ్రెస్ నాయకుడు జస్బీర్ సింగ్ గిల్ విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అమృతపాల్ సింగ్, కుల్బీర్ సింగ్ జిరాలతో పాటు అకాలీదళ్‌కు చెందిన విర్సా సింగ్ వాల్తోహా, ఆప్‌కి చెందిన లాల్‌జిత్ సింగ్ భుల్లర్ ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. చివరికి వేర్పాటువాదినే విజయం వరించింది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డి అభినందనలు