NTV Telugu Site icon

Imran Khan: కేజ్రీవాల్ బెయిల్‌పై ఇమ్రాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు

Eke

Eke

పాకిస్థాన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ప్రస్తావనకు వచ్చింది. అక్కడ మీడియా ఈ అంశాన్ని హైలెట్ చేసింది. ఇంతకీ సందర్భం ఏంటి? ఎవరు ఈ ప్రస్తావనకు తీసుకొచ్చారో తెలియాలంటే ఈ వార్త చదవండి.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఓ కేసులో కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ విషయాన్ని ప్రస్తావించారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారం కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ దక్కిందని.. కానీ.. ఇక్కడ తాను మాత్రం రాజకీయ అణచివేతకు గురవుతున్నానని వాపోయారు.

ఇది కూడా చదవండి: Ys Jagan: రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి!

నేషనల్‌ అకౌంటబిలిటీ ఆర్డినెన్స్‌లో సవరణలకు సంబంధించిన కేసులో సీజేపీ జస్టిస్‌ ఖాజీ ఫయీజ్‌ ఇసా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ విచారణకు హాజరయ్యారు. 2022లో అధికారం కోల్పోయినప్పటినుంచి తనకు ఎదురైన పరిస్థితులను ఆయన వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికలకు తనను దూరం పెట్టేందుకుగానూ ఐదు రోజుల్లోనే ఓ కేసులో దోషిగా తేల్చారన్నారు. భారత్‌లో అయితే ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు అక్కడి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరుచేసిందని, తాను మాత్రం ఇక్కడ అప్రకటికత ‘మార్షల్ లా’ కింద అణచివేతను ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్

ఢిల్లీ మద్యం స్కామ్‌లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌ ఈనెల 2న తిరిగి జైలుకు వెళ్లారు.