NTV Telugu Site icon

Jai Hanuman: ‘జై హనుమాన్’ సినిమా వచ్చేది 2026కే .. డైరెక్టర్ ఫస్ట్ చాయిస్ ఇదే..!

Jai Hanuman

Jai Hanuman

తెలుగు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద రూ.320 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్‌’పైనే ఉంది.. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పుడు షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు…

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో ఉన్న సినిమా పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా కన్నా ముందు అనుపమ పరమేశ్వరన్ తో ఓ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలని డైరెక్టర్ భావిస్తున్నాడు.. ఆ సినిమాను ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు..

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుపమ సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రణ్‌వీర్ సింగ్‌తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా ఈ హిందీ ప్రాజెక్ట్‌ను ముగించి ఆ తర్వాతే ‘జై హనుమాన్’ సినిమాను మొదలు పెడతారని సమాచారం.. అంటే 2026 కే జై హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి డైరెక్టర్ ఏం చెప్తారో చూడాలి..