Site icon NTV Telugu

Physical Harassment : ప్రభుత్వ ప్రధానోపాధ్యాయునిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

Physical Harassment

Physical Harassment

Physical Harassment : జగిత్యాల జిల్లా విద్యా వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలంలో ఉన్న ఓ ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిపై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అతను విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని, కులాలను అడిగి అవమానిస్తూ టచ్ చేస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ ఘటనపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా విద్యాధికారి (డీఈవో) రాముకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు తమ సమస్యను వెల్లగక్కుతూ ప్రధానోపాధ్యాయుడు మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన డీఈవో, బాధిత విద్యార్థినులకు న్యాయం జరిగేలా శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ ఘటన విద్యా రంగంలో కలకలం రేపడంతో, సంబంధిత అధికారుల చర్యలపై అందరి దృష్టి నెలకొంది. బాధిత విద్యార్థినులకు న్యాయం జరిగేలా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై సభలో రాహుల్ గాంధీ మౌనం.. ప్రియాంకా గైర్హాజరు.. ఎందుకు..?

Exit mobile version