Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. నిన్న(శనివారం) ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసీఆర్ మళ్లీ పార్టీలోకి పిలుస్తే వెళతారా..? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. “కేసీఆర్ తండ్రిగా పిలిస్తే తప్పకుండా వెళతాను.. రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పోను.. ఏ పార్టీలోకి నేను ఎందుకు పోతాను.. ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకురాలిని.. బీఆర్ఎస్ నుంచి గెంటి వేయబడ్డ నాయకురాలిగా.. బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి లోటు పాట్ల గురించి చెబుతున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచింది.. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యక్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మంచిది కాబట్టి చెబుతున్నాం.. సరి చేసుకోకుంటే జూబ్లీహిల్స్ వంటి రిజల్ట్ రిపీట్ అవుతా ఉంటుంది. దాని వల్ల నష్టం తెలంగాణ ప్రజలకే.. కాబట్టి బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యకు వచ్చి పెర్ఫామెన్స్ చేయలేకపోతే మా లాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం.. మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉంది.” అని కవిత సమాధానమిచ్చారు.
READ MORE: Mouse Turned Girl: రాత్రికి రాత్రే అమ్మాయిలా మారిన ఎలుక.. సోషల్ మీడియాలో వైరల్
అంతే కాదు.. మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, ఆయన సతీమణి ప్రైవేట్ పాల వ్యాపారం పెట్టుకుని లాభాలు పొందుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు పాలు పోసి లాభాలు పొందారని ఆరోపించారు. సీఎం PROగా ఉన్న అయోధ్య రెడ్డి హరీష్ రావు పాల వ్యాపారం అక్రమమని చెప్పారన్నారు. హరీష్ రావు ఇన్ని అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న సీఎంకి ఎందుకు కనపడటం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కనీసం సీఎం స్పందించడం లేదని అడిగారు. హరీష్ రావుకి, సీఎం రేవంత్ కి ఉన్న ఒప్పందం ఏంటో సమాధానం చెప్పాలని నిలదీశారు.
