Site icon NTV Telugu

Jagga Reddy : ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు.. ఆయన మీద బురద జల్లుతున్నారు

Jagga Reddy

Jagga Reddy

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాలల్చి మీద వేస్తుండు అని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన కు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాట్లేదని ఆయన అన్నారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు,ఆయన మీద బురద జల్లుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందన్నారు జగ్గారెడ్డి. తడిసిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారని, రైతులు,రైస్ మిల్లర్లు ఇబ్బంది పడొద్దని నష్ట కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందన్నారు జగ్గారెడ్డి. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమేనని, ఐదు ఏండ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనను ఎవరు డిస్టర్బ్ చేయరని, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆధారాలు లేని అభియోగాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 

మహేశ్వరెడ్డి ఇప్పటికైనా ఆరోపణలు ఆపితే మంచిదన్నారు జగ్గారెడ్డి.. మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేకున్నా.. ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ తెల్లని కాగితం వంటి వారని, అనవసరంగా ఎందుకు ఇంకు చల్లుతారని ప్రశ్నించారు. బట్ట కాల్చి ఉత్తమ్ మీద వేయడం కరెక్ట్ కాదని మహేశ్వర రెడ్డికి సూచించారు. ఉత్తమ్‌ను ఇబ్బంది పెట్టడంలో మహేశ్వర రెడ్డికి ఒనగూరే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదన్నారు.

 

Exit mobile version