ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో నే జీవనోపాధి కలిపించిన పథకం తెచ్చింది సోనియా గాంధీ అని, ఉపాధి హామీతో గ్రామాభివృద్ధి.. జీవనోపాధి కల్పించినది సోనియమ్మ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ.. పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు భోజనము పెట్టిన అక్షయ పాత్ర ఎట్లనో ఉపాది హామీ పథకం కూడా పేదలకు అక్షయ పాత్ర లాంటిదని, అలాంటి పేదల పథకం మోడీ పక్కన పెట్టేశారన్నారు. ప్రజలు దీన్ని ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. . బీజేపీ నేతల మాటలు అర్థం పర్థం లేనివని, సోనియాగాంధీ ఎన్ని కష్టాలు చూసిందో.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ల హత్యలు లాంటి గడ్డు పరిస్థితి చూశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు.
అంతేకాకుండా.’.పీవీ నర్సింహ రావు ని ప్రధాని చేసింది సోనియాగాంధీ. భారత రత్న ఇచ్చి..మేమే ప్రధాని చేసినంత ప్రచారం చేసుకుంటున్నారు. సోనియాగాంధీ పీవీ ని ప్రధాని చేయకుంటే .. భారత రత్న ఇచ్చే వాళ్ళా..?. మాలాంటి వాళ్ళం mla పోస్ట్ లొసం కొట్లాడుతున్నాం.. కానీ ప్రధాని పోస్ట్ వద్దని వదిలేసుకుంది సోనియాగాంధీ. మోడీకి రాజకీయ భిక్ష పెట్టింది వాయ్ పాయ్.. అద్వానీ.. ఎప్పుడైనా అద్వానీ పట్ల నిజాయితీ ప్రదర్శించారా మోడీ. బీజేపీ నేతల కు పదవులు అద్వానీ భిక్ష. రామ మందిరం కి కారణం అయినా అద్వానీ ని పిలిచి సన్మానం అయినా చేశారా..?మీకు ఎథిక్స్ ఉన్నాయా..? 120 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రలో 20 ఏండ్లు సోనియా గాంధీ నే అధ్యక్షురాలు. రాహుల్.. ప్రియాంక లు జోడో యాత్రల పేరుతో పేదల కోసం పని చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా పని చేస్తున్న కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్. బీజేపీ ఆఫీస్ లో ప్రచారక్ ఏది రాసిస్తే అదే మాట్లాడతరు. బీజేపీ అధ్యక్షులు డమ్మీ మాత్రమే.. నడిపించేది అంత ప్రచారక్ దే.
హిందు సాంప్రదాయం లో విదేశీ లేడి ఇండియా వ్యక్తిని చేసుకుంటే ఇండియా మహిళే అవుతుంది. ఇంత జ్ఞానం కూడా కిషన్ రెడ్డి కి తెలియదా. కేటీఆర్.. నీ ఎంపీ అభ్యర్దులు దమ్ము లేని క్యాండేట్లు. నీ బి ఫార్మ్ వెనక్కి ఇచ్చిపోతున్నారు. నువ్వు సీఎం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు.. కేటీఆర్..కేసీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం కి స్వేచ్ఛ లేదు. కానీ మా ప్రభుత్వం లో ప్రతిపక్షం కి స్వేచ్ఛ ఇస్తున్నాం.. అందుకే ఏదైనా మట్లాడుతున్నారు.. కేసీఆర్.. కేటీఆర్..హరీష్ ఆర్టీసీ బస్సులు ఎక్కండి ..మహిళలతో మాట్లాడండి. బస్సు ప్రయాణం ఉచితంగా రావడం లేదని ఎవరైనా అడిగితే మాకు చెప్పండి.’ అని జగ్గారెడ్డి అన్నారు.