Jagdeep Dhankhar: రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ఇంతకీ ఆయన ఎక్కడికి రానున్నారంటే..
READ MORE: Gundu SudhaRani: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన గుండు సుధారాణి
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గొల్లపల్లి టోల్‌గేట్ వయా పెద్దగోల్కొండ మీదుగా ఇండియన్ బేకరీ(తొండుపల్లి), బుర్జుగడ్డ వద్ద యూటర్న్ తీసుకొని ముచ్చింతల్, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్, తిమ్మాపూర్, షాద్‌నగర్ మీదుగా మళ్లిస్తారు. అలాగే, గచ్చిబౌలి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పెద్దగోల్కొండ టోల్‌గేట్, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్, తిమ్మాపూర్, షాద్‌నగర్ మీదుగా మళ్లీంచనున్నారు. షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ట్రాఫిక్‌తోపాటు పెంజర్ల ఎక్స్‌రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అమీర్‌పేట్ మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు నుంచి పెద్దగోల్కొండ టోల్‌గేట్, శంషాబాద్, హైదరాబాద్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?