Site icon NTV Telugu

Jagapathi Babu: జిత్తు టు అప్పలసూరి: జగ్గుభాయ్ విశ్వరూపం చూపిన రోల్స్ ఇవే

Jagapati Babu

Jagapati Babu

Jagapathi Babu: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను అవలీలగా పోషించగల నటులలో జగపతి బాబు కూడా ఒకరు. ఆయన 1989లో ‘సింహస్వప్నం’తో వెండి తెరపైకి హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘గాయం’, ‘అంతఃపురం’, ‘సుభలగ్నం’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో కుటుంబ కథానాయకుడిగా, యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత హిట్లు తగ్గడంతో కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే 2014లో వెండి తెరపై ప్రభంజనం సృష్టించిన ‘లెజెండ్’ చిత్రంతో ప్రేక్షకులు ముద్దుగా జగ్గుభాయ్‌గా పిలుచుకునే జగపతి బాబు వెండి తెరపై తన
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

READ ALSO: IBomma Ravi : రవి కేసులో బిగ్ ట్విస్ట్: విదేశాల ముచ్చట అబద్ధం..షాకింగ్ విషయం వెలుగులోకి

ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు వర్ణించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఆ పాత్రల్లో నటించారని చెప్పడం కంటే జీవించారని అనడం సబబుగా ఉంటుంది. అంతలా ఆ పాత్రల్లో లీనం అయ్యి, ప్రేక్షకుల మనస్సుల్లో తన అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ భాగం అయ్యారు. ఈ రోజు పెద్ది సినిమా నుంచి జగపతి బాబుకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను మామూలు షాక్‌కు గురి చేయలేదు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ స్టైలిష్ విలన్‌గానో లేదా క్లాస్ తండ్రి పాత్రల్లోనో కనిపించే జగపతి బాబు, ఈసారి ఊహించని మేకోవర్‌తో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో అప్పలసూరి పాత్ర అత్యంత పవర్‌ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతోంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో జగ్గు భాయ్ పోషించిన వైవిధ్యమైన పాత్రలు ఇవే..
2014లో విడుదలైన ‘లెజెండ్’ సినిమాతో జగపతి బాబు వెండి తెరపై తన సెకండ్ ఇన్సింగ్స్‌ను తిరిగి స్టార్ చేశాడు. ఈ సినిమాలో జగ్గుభాయ్.. జితేంద్రగా బాలకృష్ణను ఢీకొన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు నటించిన జితేంద్ర అనే పాత్ర.. ఒక క్రూరమైన, అధికార దాహంతో ఉండే వ్యక్తికి సంబంధించింది. ఈ రోల్‌లో మనకు ఎక్కడ కూడా జగపతి బాబు కనిపించడు.. కేవలం జితేంద్ర మాత్రమే కనిపిస్తాడు. ఈ సినిమాలో అంతలా ఆ పాత్రలో లీనం అయ్యి ప్రేక్షకులను సప్రైజ్ చేశాడు జగపతి బాబు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో తన సెకండ్ ఇన్సింగ్స్‌కు సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఈ రోల్ ఆయనకు విలన్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టి, ఒక్కసారిగా తన కెరీర్‌ను టాప్ గేర్‌లోకి దూసుకెళ్లేలా చేసింది.

ఈ సెకండ్ ఇన్సింగ్స్‌లో ఆయన కేవలం విలన్ రోల్స్‌కే పరిమితం కాలేదు. ఆయన తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతిపాత్రలో కూడా ఒదిగిపోయి నటించి మెప్పించారు. ప్రతి పాత్రలో కూడా నటన పరంగా వైవిధ్యం చూపించారు.’శ్రీమంతుడు’ చిత్రంలో ఆయన పోషించిన రవికాంత్ పాత్రే దీనికి చక్కటి ఉదాహారణ. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జగ్గుభాయ్ రవికాంత్ అనే ధనవంతుడిగా, ఊరికి దూరంగా ఉండే పాత్రలో నటించారు.

అలాగే ‘నన్నకు ప్రేమతో’ సినిమాలో కృష్ణమూర్తి కౌటిల్య అనే పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ రివెంజ్ డ్రామాలో జగపతి బాబు కృష్ణమూర్తి కౌటిల్య అనే శక్తివంతమైన వ్యాపారవేత్తగా, స్టైలిష్ విలన్ రోల్ ప్లే చేశాడు. ఈ పాత్రలో ఆయన చూపించిన నటన మామూలుగా ఉండదు. నిజానికి ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయి అని పలువురు సినిమా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఫణీంద్ర భూపతిగా అలరించాడు జగ్గుభాయ్. ఈ సినిమాలో ఆయన పోషించిన ఫణీంద్ర భూపతి పాత్ర గ్రామ అధ్యక్షుడిగా, అధికార దాహంతో ఉండే విలన్‌గా నటించి మెప్పించాడు. ఆయన ఈ సినిమాలో పలికిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ విలన్ రోల్స్‌లో ఫణీంద్ర భూపతి కూడా ఒకటి.

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బసిరెడ్డి పాత్ర క్రూరత్వానికి ప్రతీక. ఈ పాత్రలో జగ్గుభాయ్ నట విశ్వరూపం కనిపిస్తుంది. ఈ పాత్రలో ఆయన రఫ్ అండ్ టఫ్ లుక్, ఇంటెన్స్ నటన ప్రేక్షకుల మదిలో చిత్రస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’లో ఆయన పోషించిన రాజా మన్నార్ పాత్ర తన కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన విలన్ రోల్స్‌లో మాత్రమే కాకుండా, పాజిటివ్ పాత్రల్లో కూడా మెప్పించారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్లో తన నట విశ్వరూపం చూపిస్తూ జగ్గుభాయ్ తన సెంకడ్ ఇన్సింగ్స్‌లో సూపర్ రోల్స్ అందుకుంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ‘పెడ్డి’ చిత్రంలో ఆయన పోషించిన అప్పలసూరి పాత్ర తనకు మరింత పేరు తీసుకువస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఆయన మరిన్ని అద్భుతమైన పాత్రల్లో కనిపించాలని ఆశిద్దాం.

READ ALSO: Madhavi Latha: టాలీవుడ్ హీరోయిన్ మాధవీలతపై కేసు

Exit mobile version