Jagananne Maa Bhavishyathu: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.. ఏ రాజకీయ పార్టీ అయినా రికార్డు సమయంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించింది లేదు.. ఎందుకంటే.. రోజుకో రికార్డు తరహాలో ప్రజలను కలుస్తున్నాయి వైసీపీ శ్రేణుల.. 12వ రోజు (ఏప్రిల్ 18) చివరి నాటికి 84 లక్షల కుటుంబాలు మెగా పీపుల్స్ సర్వేలో తమ ప్రతిస్పందనలను నమోదు చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.. రాష్ట్ర ప్రజలు తమ సొంత మరియు తమ పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను మాత్రమే విశ్వసిస్తున్నామని.. రుజువు చేస్తూ పార్టీకి 63 లక్షలకు పైగా మిస్డ్ కాల్‌లు ఇవ్వడం మరో విశేషంగా చెప్పుకోవాలి..
Read Also: Rana Naidu 2: దగ్గుబాటి బాయ్స్ మళ్లీ వస్తున్నారు… ఇంత జరిగాకా కూడానా?
ఇక, ఈ నెల 11వ తేదీన ప్రారంభమయిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఊరూరా, వాడవాడలా ముందుకి సాగిందని వైసీపీ తెలిపింది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానించారు. కొన్ని ఊళ్లలో అయితే ఎంతో సంబరంగా, మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగింది.వైయస్ జగన్ పాలనపై తమకు నమ్మకం ఉందన్నారు ప్రజలు. భవిష్యత్తులో కూడా మళ్లీ ఆయన పాలనే కావాలని, రావాలని ప్రజలు అంతా విశ్వసించడంతో పాటుగా ప్రభుత్వానికి మద్దతుగా వారి ఫోన్ల ద్వారా మిస్డ్ కాల్స్ ఇచ్చి కుటుంబాలు అన్నే పూర్తి స్థాయి మద్దతు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఈ కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టారని చెబుతున్నారు వైసీపీ నేతలు.
తాము ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అంటున్నాయి వైసీపీ శ్రేణులు.. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను ఇష్టంగా అతికించుకున్నారు.82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా సీఎం వైయస్ జగన్ సందేశం రావడంతో ఆనందపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో మిస్ట్ కాల్స్ వచ్చాయంటే స్పందన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు.