Site icon NTV Telugu

Jagan Tour: మాజీ సీఎం జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన అనుమతులుపైఉత్కంఠ…

Jagan With People

Jagan With People

Jagan Tour: మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన అనుమతులుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషనర్ సిటీ పరిధిలో పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చారు. జగన్ సహా 10 వాహనాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేషనల్ హైవే మీద వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోడ్ షోలు, జన సమీకరణ చేస్తే పర్యటనను అర్ధాంతరంగా నిలిపివేస్తామని షరతులు విధించారు.. రోడ్డు మార్గంలో జగన్ నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి లేదని అనకాపల్లి ఎస్పీ ప్రకటించారు. మరోవైపు… అనుమతి ఉన్నా లేకపోయినా పర్యటన జరిగి తీరుతుందని వైసీపీ ప్రకటించింది. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించించారు.

READ MORE: Pooja-Hegde : టాలీవుడ్‌కి కమ్‌బ్యాక్ చేస్తున్న పూజా హెగ్డే.. షాకింగ్ రెమ్యునరేషన్

మరోవైపు.. విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. జగన్‌ పర్యటన రోజే విశాఖలో మహిళల ప్రపంచకప్‌ 2025 మ్యాచ్‌ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్‌ అవుతుందని, రోడ్‌ బ్లాక్‌ అయితే తమిళనాడులో దళపతి విజయ్‌ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, జగన్‌ పర్యటనకు అనుమతి ఇవ్వలేం అని సీపీ తేల్చి చెప్పారు.

READ MORE: Rajouri Terror Attack: రాజౌరిలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

‘అక్టోబర్ 9న ఉమ్మడి విశాఖలో వై ఎస్ జగన్ పర్యటన ఉన్నట్లు మాకు సమాచారం ఇచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి 11 గంటలకు చేరుకుంటారు. రోడ్ మార్గంలో మాకవరపాలెం వరకు వెళ్ళే యోచన ఉన్నట్టు చెప్పారు. అదే రోజు మహిళల ప్రపంచకప్‌ 2025 మ్యాచ్‌ ఉంది. ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు మ్యాచ్‌కు వస్తున్నారు. పోలీస్ మొత్తం ఆ బందోబస్తు సేవలు అందిస్తారు. ఆ రోజు చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎయిర్‌పోర్ట్‌ కూడలి నుంచి 11 కిలోమీటర్లు మర్రిపాలెం కూడలి వరకు వైఎస్ జగన్ పర్యటన మార్గం ఉంది. ర్యాలీగా వేల వేల మంది వస్తారు అని సమాచారం ఉంది. జాతీయ రహదారి బ్లాక్ అవుతుంది. తమిళ నాడులో సినీ నటుడు విజయ్ రోడ్ షోకి ఏ విధమైన ఇబ్బంది వచ్చింది అదే పరిస్థితి వస్తుంది. ఈ కారణాలతో జగన్ పర్యటనకు పోలీస్ అనుమతి లేదు. ఈ విషయాన్ని నేరుగా వారికి లేఖలో తెలియజేస్తున్నాం’ అని సీపీ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.

Exit mobile version