ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు. దాంతో నేడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు అధికారులు.
Also read: World War-3: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న వరల్డ్ వార్-3
ఈ నేపథ్యంలో సోమవారం నుండి యధావిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మళ్లీ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఇక సోమవారం నాడు కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్ర మొదలు కాబోతోంది. అక్కడ నుంచి యాత్ర గన్నవరం, ఆత్కూర్, వీరపల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వరకు కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం జొన్నపాడులో భోజన విరామం తర్వాత సాయంత్రంకి జనార్దనపురం మీదుగా గుడివాడకు ఆయన చేరుకుంటారు. నగవరప్పాడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రేపు ఆయన పాల్గొనబోతున్నారు.
Also read: Rashmika Mandanna: ‘పుష్ప 2’ లో శ్రీవల్లి 2.0ను చూస్తారు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..
ఇక ఆ తర్వాత రాత్రి హనుమాన్ జంక్షన్, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు. శనివారం నేడు జరిగిన దాడి కారణంగా సీఎం సెక్యూరిటీ విషయంలో అనేక కీలక మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందుకోసం నిఘా విభాగం కీలక సూచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక దాడి జరిగిన నేపథ్యంలో భాగంగా.. మళ్లీ జనంలోకి వస్తున్న ఆయన ఏ అంశంపై ఏ విధంగా మాట్లాడుతారో అన్నది ఇప్పుడు విపక్షాలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విపక్షాలను ఏ రకంగా టార్గెట్ చేస్తారో అంతు చిక్కట్లేదు.