Site icon NTV Telugu

Jadeja – Ashwin: ఆ విషయంలో అశ్విన్‌ పై ఫన్నీ కామెంట్స్ చేసిన జడేజా..!

12 As

12 As

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమదైన ముద్ర వేసుకున్నారు. ఇదివరకు కాలంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను తలపించేలా జడేజా – అశ్విన్ ల ద్వయం కూడా అనేక మ్యాచ్లలో భారత్ ను విజయ తీరాలకి చేర్చారు. ఇకపోతే తాజాగా 100 టెస్ట్ మ్యాచ్ లు అశ్విన్ 100 టెస్టులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు., అశ్విన్ తాను ఆడిన 100 టెస్టుల్లో ఇప్పటివరకు 500కు పైగా వికెట్లను తన ఖాతలో వేసుకున్నాడు. ఇక అశ్విన్ టీమిండియాకి చేసిన సేవలకు గాను తమిళనాడు క్రికెట్ సంఘం ఆయనను సన్మానించింది. ఇందులో తమిళనాడు క్రికెట్ సంఘం అశ్విన్ కు 500 బంగారు నాణేలను కూడా అందజేసింది. వీటితోపాటు క్యాష్ ప్రైస్ కూడా అందజేసింది.

Also read: IPL Match Tickets: అప్పటినుంచి ఆన్‌ లైన్‌ లో ఐపీఎల్‌ టిక్కెట్ల అమ్మకం..!

ఈ అంశంపై రవీంద్ర జడేజా ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో వైరల్ గా మారింది. వైరల్ గా మారిన వీడియోలో జడేజా మాట్లాడుతూ.. ” హాయ్ అశ్విన్ భాయ్.. నువ్వు 100 టెస్టులాడినందుకు, 500 వికెట్లు తీసినందుకు అభినందనలు. ముందుముందు కూడా భవిష్యత్తులో నువ్వు ఇది కొనసాగించాలని.. తనకి ఎప్పుడు సూచనలు ఇస్తూనే ఉండాలని కోరాడు. తాను కూడా మెరుగైన ప్రదర్శన చేసి నీ స్థాయికి త్వరలో చేరుతానని” తెలియజేశాడు. అంతే కాకుండా 1981లో విడుదలైన రజినీకాంత్ సినిమాలోని క్యారెక్టర్ లను పోలుస్తూ ఓ కామెంట్ చేశాడు.

Also read: Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న వ్యక్తి..!

`మనిద్దరి భాగస్వామ్యం చూస్తే.. నాకు ఓ సినిమా గుర్తుకొస్తోందని చెబుతూ.. మన ఇద్దరి పేర్లు ఒకటే. నేను రవి ‘ఇంద్రన్’, నువ్వేమో రవి’చంద్రన్’. నువ్వు మీసం లేని చంద్రన్, నేను మీసమున్న ఇంద్రన్“ అంటూ సరదాగా పేర్కొన్నాడు.

Exit mobile version