NTV Telugu Site icon

MLA Laxma Reddy: స్పీడ్‌ పెంచిన లక్ష్మారెడ్డి.. బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

Mla Laxma Reddy

Mla Laxma Reddy

MLA Laxma Reddy: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. దూకుడు చూపిస్తున్నారు.. ఇప్పటికే జడ్చర్ల వేదికగా సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ తర్వాత.. నియోజకవర్గంలో మరింత సానుకూల పవనాలు వీస్తున్నాయి.. అదే ఊపును కొనసాగిస్తూ.. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు లక్ష్మారెడ్డి.. నేడు నవాబుపేట మండలంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డితో కలిసి ముందుగా పర్వతపూర్ మైసమ్మ దేవత ఆశీస్సులు తీసుకుని అనంతరం రుద్రారం, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించారు లక్ష్మారెడ్డి..

Read Also: India Mango Exports: ఈ సీజన్‌లో 19శాతం పెరిగిన మామిడి ఎగుమతులు.. ప్రపంచానికి మనదే నచ్చింది

ఇక, ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యను తీర్చి, ఇంటిగడపకే మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చేసినందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు . ఈ ఎన్నికల్లోనూ అధికార బీఆర్ఎస్‌ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటేసి, తమ విశ్వాసం చాటుకుంటామని ప్రకటించారు గ్రామస్తులు.. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని.. పని చేసే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి రావాలని.. అందుకు అనుగుణంగా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..