బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…ఆమె కి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. నటిగా పెద్దగా రానించక పోయిన కూడా ఆమె గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో 68 మిలియన్స్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ రేంజ్ ఏమిటో దీన్ని బట్టి తెలుస్తుంది..శ్రీలంక దేశానికి చెందిన మోడల్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ కోసం బాలీవుడ్ లో అడుగుపెట్టారు. 2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మర్డర్ 2, రేస్ 2 మరియు హౌస్ ఫుల్ 2 చిత్రాలతో ఆమెకు ఫేమ్ వచ్చింది.కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. రవితేజ హిట్ మూవీ కిక్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం బాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది. ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తూ మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది.ప్రభాస్ హీరోగా విడుదలైన సాహో చిత్రంలో జాక్విలిన్ ఐటెం సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో జాక్విలిన్ గ్లామర్ తో యూత్ ని కట్టిపడేసింది. ఈ సాంగ్ కోసం జాక్విలిన్ పెర్నాండెజ్ భారీగా ఛార్జ్ చేశారని సమాచారం.జాక్విలిన్ కు తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ వచ్చింది. కానీ అనుకోని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
దీనితో జాక్విలిన్ ఆమె స్థానంలో నోరా ఫతేహి తీసుకున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే జాక్విలిన్ పై అనేక వివాదాలు ఉన్నాయి. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆమెకు శిక్ష కూడా పడింది. రూ. 50000 పూచీకత్తుపై బెయిల్ తీసుకున్నారు.గత ఏడాది ఈ భామ విక్రాంత్ రోనా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. రక్కమ్మ సాంగ్… విపరీతంగా పాపులరిటి పొందింది. అలాగే సర్కస్, రామ్ సేతు, అటాక్ ఇలా వరుస చిత్రాలు చేసింది. అవేవి కూడా విజయం సాధించలేదు.అక్షయ్ కుమార్ సెల్ఫీ మూవీలో జాక్వీలిన్ కీలక రోల్ చేసింది. మలయాళ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్సు రీమేక్ గా సెల్ఫీ తెరకెక్కింది. అయితే ఆ రీమేక్ హిందీలో వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం ఈ భామ ఫతేహ్ టైటిల్ తో ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేసింది. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ లో జాక్విలిన్ స్టన్నింగ్ పోజులిచ్చి రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి…
