Site icon NTV Telugu

Jacqueline Fernandez: సుప్రీంకోర్టులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ..

Jacqueline Fernandez

Jacqueline Fernandez

Jacqueline Fernandez: సుప్రీంకోర్టులో సోమవారం నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈసీఐఆర్ కొట్టివేయాలన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నేడు విచారణకు వచ్చిన ఈ కేసుపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం జోక్యం చేసుకోము అని ఫెర్నాండెజ్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి తెలిపింది.

READ ALSO: Cinematic Bank Robbery: సినిమా లెవల్‌లో దోపిడి.. బ్యాంక్‌లో రూ.2 కోట్లు దోచుకున్న వైనం!

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్ భార్యలను రూ.200 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు సుఖేష్ చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఈడీ జాక్వెలిన్‌ను నిందితురాలిగా పరిగణిస్తుంది. ఈడీ వర్గాలు మాట్లాడుతూ.. సుకేశ్ చంద్రశేఖర్‌ దోచుకున్న ఈ డబ్బు నుంచి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని వెల్లడించాయి. సుకేశ్ ఒక దోపిడీదారుడు అనే విషయం నటికి ముందే తెలుసని, అయినా ఆయనతో తన సాన్నిహిత్యాన్ని కొనసాగించారని తెలిపాయి. జాక్వెలిన్‌ మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌.. ఇలా దాదాపు రూ.10కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు నిందితుడు ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.

READ ALSO: Modi Trump Meeting: ట్రంప్ దూకుడుకు మోడీ కళ్లెం వేస్తారా.. ! మలేషియా వేదికగా ఏం జరగబోతుంది..

Exit mobile version