NTV Telugu Site icon

Jabardast : ఆసియా-నూకరాజు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా?

Nukaraju Asia

Nukaraju Asia

మొన్నటివరకు వెండితెర పై ప్రేమ జంటలు పెళ్లి చేసుకుంటూ వచ్చారు.. అదే ట్రెండ్ ఇప్పుడు బుల్లితెరపై కూడా నడుస్తుంది.. బుల్లితెరపై షో లలో సందడి చేస్తున్న జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇటీవలే రాకేష్, సుజాతలు పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు తాజాగా మరో జంట పెళ్లికి రెడీ అయ్యాయి.. ఆ జంట ఎవరో కాదు నూకరాజు, ఏంజెల్ ఆసియా త్వరలోనే నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నారు. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వీరిద్దరూ కూడా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా నూకరాజు, ఆసియా కలసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే..

వీరిద్దరు కలిసి స్టేజ్ మీద నవ్వులు పూయిస్తూ మంచిది క్రేజ్ ను సంపాదించుకున్నారు..పటాస్ షో ద్వారా పరిచయమైన వీరిద్దరూ జబర్దస్త్ వచ్చిన తర్వాత మంచి పాపులారిటీ దక్కించుకున్నారు.మొదటినుంచి స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరూ జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత ప్రేమికులుగా మారారని చెప్పాలి. మొదట్లో ఒక సామాన్య కమెడియన్ గా జబర్దస్త్ వచ్చిన నూకరాజు ఆ తర్వాత జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల ఆధారాభిమానాలతో అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ అయ్యారు..

మరొకవైపు వీరిద్దరూ కలిసి రెగ్యులర్గా వ్లాగులు చేస్తూ తమ ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తాజాగా వీరిద్దరు చేసిన వ్లాగ్ కి యూట్యూబ్లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. నూకరాజు కోసం వైజాగ్ వెళ్లి సర్ప్రైజ్ చేసిన ఆసియా అని, ఇద్దరు కలిసి కెఎఫ్సి చేస్తే హిట్ ఆర్ ప్లాప్ అని, ఇలా నూకరాజు పడుకున్నాక ఏం చేశానో తెలుసా అంటూ ఇలా రకరకాల వ్లాగులు చేసి పోస్ట్ చేశారు.. అవి బాగా ఫెమస్ అయ్యాయి..ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ కలిసి ఎంగేజ్మెంట్ కు రెడీ అవుతున్నాం అంటూ ఓ వీడియోను తమ వ్లాగ్ చేసి అప్లోడ్ చేశారు.ఇందులో మనం చూసినట్లయితే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కోసం, పెళ్లి కోసం ఫోటోషూట్ అలాగే అన్ని పనులు సిద్ధం చేసుకుంటున్నామని చెప్పగా.. ఆ వీడియో ను చూసిన వారంతా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు..త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం..