NTV Telugu Site icon

ITR Refund: ఇన్ కమ్ ట్యాక్స్‌ రీఫండ్ ఇంకా క్రెడిట్‌ కాలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి

Tax Return

Tax Return

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు 2023 జూలై 31వ తేదీని డెడ్ లైన్ గా విధించింది ఆదాపు పన్ను శాఖ. దీంతో ట్యాక్స్ చెల్లించిన వ్యక్తులు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది పొడవునా ఎక్కువ పన్ను ను చెల్లించిన వారు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి రిటర్న్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా చాలా మంది బ్యాంక్ ఖాతాల్లో రిటర్న్స్ డబ్బు జమ కాలేదు. కేవలం గడువు లోపు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడే కాదు ఫైల్ చేసిన తరువాత కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా మీ రీఫండ్ ప్రాసెస్ ను లేట్ చేయవచ్చు. ఐటీఆర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఫైల్ చేసినప్పటికీ, ఇంకా వెరిఫై చేయకపోతే,ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణిస్తారు. అంటే అన్నీ చేసినా ప్రాసెస్ పూర్తి అయినట్లు భావించరు. రిటర్న్‌లో అందించిన సమాచారం ఖచ్చితత్వం, చట్టబద్ధతను నిర్ధారించడానికి వెరిఫికేషన్‌ అనేది కీలకమైన దశ. ఇది పూర్తికాకపోతే మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కాదు. అంతా సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం దీనిని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆదాయపు పన్ను శాఖను సంప్రదించకుండా స్వయంగా చేసుకోవచ్చు.

Also Read: Lion: ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా.. ఆకులు తింటున్న సింహం

మీరు గతంలో దీని కోసం ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్‌ కోడ్ ఉపయోగించి ఉంటే, ఇప్పుడు ఐటీఆర్‌ని వెరిఫై చేయడానికి ఆ కోడ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా జనరేట్ చేసుకోవచ్చు. అనంతరం ఐటీఆర్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఇక మరో విధంగా ఆధార్ నంబర్ ని ఉపయోగించి ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్ ) ని జనరేట్ చేసి ఆన్ లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. ఇంతకముందే ఈ ప్రాసెస్ చేసి ఉంటే కూడా దాని ద్వారా కూడా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఇక మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్‌ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉపయోగించి కూడా ఇ-వెరిఫికేషన్‌ చేయవచ్చు. సెక్యూర్‌, ఎఫిషియంట్‌ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ కోసం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ని ఉపయోగించి ఇన్ ట్యాక్స్ రిటర్న్ పై డిజిటల్‌గా సంతకం చేయవచ్చు. మీరు కనుక ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉంటే చకచక ఈ ప్రాసెస్ లలో వెరిఫై చేసుసుకోండి. ఎందుకు మీకు ప్రాసెస్ ఆలస్యం అవుతుందో తెలుసుకోండి.

Show comments