itel Vista Tab: ఐటెల్ (itel) సంస్థ భారత మార్కెట్‌లో కొత్త టాబ్లెట్ Vista Tab 30ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, వినోద ప్రియులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. కేవలం 8mm సన్నని డిజైన్‌తో, సుమారు 550.5 గ్రాముల బరువుతో ఇది తేలికగా ఉంది. ఈ టాబ్లెట్‌లో 11 అంగుళాల FHD+ (1920 x 1200) డిస్‌ప్లే ఉంది. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్పష్టమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. 84% స్క్రీన్-టు-బాడీ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియోతో వీడియోలు, ఆన్‌లైన్ క్లాసులకు ఇది అనుకూలంగా ఉంటుంది.
itel Vista Tab 30లో UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. 4GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 8GB వర్చువల్ ర్యామ్ కలిపి మొత్తం 12GB RAM, అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512GB వరకు పెంచుకోవచ్చు. ఈ టాబ్లెట్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక ట్యాబ్ వెనుక భాగంలో 8MP రియర్ కెమెరా (ఆటోఫోకస్, ఫ్లాష్‌తో), ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. డ్యూయల్ స్పీకర్లతో ఆడియో అనుభవం మెరుగ్గా ఉంటుంది.
ఈ టాబ్లెట్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ పరంగా సెల్యులర్ (4G LTE) + Wi-Fi సపోర్ట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో మల్టీ-స్క్రీన్ కలాబరేషన్, ChatGPT ఆధారిత AI వాయిస్ అసిస్టెంట్ ‘Aivana’, లెర్నింగ్ సెంటర్ (K–12 విద్యా కంటెంట్), iPulse కిడ్స్ స్పేస్, స్క్రీన్ ప్రొజెక్షన్ సపోర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ itel Vista Tab 30 ధర రూ.11,999గా నిర్ణయించారు. ఇది స్పేస్ గ్రే, స్కై బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. భారత్‌లోని రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేస్తే రూ. 1,999 విలువైన ఫ్రీ లెదర్ బ్యాక్ కవర్ కూడా అందిస్తున్నారు.
