Site icon NTV Telugu

itel City 100: నమ్మలేని ధరలో అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లతో వచ్చేసిన ఐటెల్ సిటీ 100..!

Itel City 100

Itel City 100

itel City 100: ఇండియన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐటెల్ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఐటెల్ సిటీ 100 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ. 7,599 కాగా, ఇందులో ఉన్న ఫీచర్లు ధరను తక్కువగా అనిపించేవిగా ఉన్నాయి. మరి ఇంత తక్కువలో ఎలాంటి స్పెసిఫికేషన్స్, డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయో పూర్తి వివరాలను ఒక లుక్ వేద్దాం.

డిస్ప్లే అండ్ డిజైన్:
itel City 100 ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే ఉంది. ఇందులో 90Hz రిఫ్రెష్‌రేట్, 700 నిట్స్ బ్రైట్‌నెస్, 83% NTSC కలర్ గామట్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. Dynamic Bar 2.0 ఫీచర్ ద్వారా ఫేస్ అన్‌లాక్, కాల్ నోటిఫికేషన్స్, బ్యాటరీ అలర్ట్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి. ఫోన్ 7.65mm మందంగా ఉండేలా తేలికపాటి డిజైన్‌తో లాంచ్ అయ్యింది. అంతే కాదు ఇది IP64 రేటింగ్ కలిగి ఉండడం వల్ల నీరు, ధూళి నుండి రక్షణ ఉంటుంది.

Read Also:Bajaj Pulsar NS 400Z: రేసింగ్ లుక్‌తో రీడిజైన్‌డ్ బజాజ్ పల్సర్ NS400Z విడుదల..!

ప్రాసెసర్, స్టోరేజ్:
ఈ మొబైల్ Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4GB RAM ఉండగా, వర్చువల్ RAM తో 12GB వరకు పెంచుకునే వీలుంది. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో అదనపు ఆకర్షణ.

బ్యాటరీ:
ఐటెల్ సిటీ 100 బ్యాటరీ పరంగా చూస్తే.. ఇందులో 5,200mAh భారీ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. దీనికి 18W Type-C ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ 60 నెలల వరకూ సాఫీగా పని చేసేలా ఆప్టిమైజ్ చేయబడింది.

Read Also:Viral Video: అయ్యబాబోయ్.. బతికి ఉన్న బొద్దింకను అలా చేశావేంటి తల్లి.. వీడియో వైరల్

కెమెరా, అదనపు ఫీచర్లు:
ఈ ఐటెల్ సిటీ 100 లో 13MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. వీటి ద్వారా ఫోటలను మంచి విజువలైజేషన్ గా ఉంటాయి. ఇక ఈ మొబైల్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఉంటాయి. ఇతర ఫీచర్లలో Android 14 OS పై Aivana 3.0 AI అసిస్టెంట్ ఉంది.

ఇక ఇందులో కొత్తగా అందించేలా ఇమేజ్‌ను వర్డ్/PDF/ఎక్సెల్ ఫైల్‌గా మార్చడం, రెండు వేల్లు ఉంచి టెక్స్ట్ ఎక్స్‌ట్రాక్షన్, AI ఆధారిత రాత అండ్ ఎడిటింగ్, ఇమెయిల్ అడ్రస్ నుండి నావిగేషన్ లాంటి ప్రత్యేక ఫీచర్లను అందించనున్నారు. ఇక ఈ మొబైల్ ఫెయిరీ పర్పుల్, నేవీ బ్లూ, ప్యూర్ టిటానియం వంటి మూడు రంగులలో లభ్యమవుతుంది. దీని ధర రూ. 7,599 మాత్రమే. ఈ మొబైల్ కు మొదటి 100 రోజుల్లో ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఉంది. ఇంకా వీటితోపాటు పరిమితకాల ఆఫర్‌గా రూ. 2,999 విలువ చేసే మాగ్నటిక్ స్పీకర్ ఉచితంగా అందించనున్నారు కూడా..

Exit mobile version