Dies After Eating Broccoli Sandwich: కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. బ్రకోలీ క్యాబేజీ కుటుంబానికి చెందినవి. ఇవి మార్కెట్‌లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు దొరుకుతాయి. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. బ్రకోలీని ఉడికించి లేదా వండకుండా కూడా సలాడ్‌లా తీసుకోవచ్చు. కానీ తాజాగా జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.
READ MORE: SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?
దక్షిణ ఇటలీలో బొటులిజం అనే ప్రాణాంతక వ్యాధి బయటపడింది. తాజాగా 52 ఏళ్ల కళాకారుడు, మ్యూజీషియన్ లుయిగి డి సర్నో కోసెంజాలోని డయామంటేలో ఒక ఫుడ్ ట్రక్ నుంచి బ్రోకలీ, సాసేజ్ శాండ్‌విచ్ తిని మరణించారు. ఇద్దరు యువకులు సహా మరో తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శాండ్‌విచ్‌లలో ఉపయోగించే నూనెలో నిల్వ చేసిన బ్రోకలీ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు గుర్తించారు. ఈ జాడీలను ఇప్పుడు దేశవ్యాప్తంగా రీకాల్ చేశారు.
READ MORE: PM Modi Resignation: ప్రధాని మోడీ రాజీనామా, ఆ తర్వాతే లోక్‌సభ రద్దు.. టీఎంసీ నేత వ్యాఖ్యలు వైరల్!
లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. నేపుల్స్ ప్రావిన్స్‌లోని సెర్కోలాకు చెందిన లుయిగి డి సర్నో (52) ఒక కళాకారుడు. సెలవుల కారణంగా తన కుటుంబంతో సహా ఇంటికి వచ్చారు. డి సర్నో తన కుటుంబంతో కలిసి కోసెంజా ప్రావిన్స్ డయామంటేలోని సముద్ర తీరంలో ఒక ఫుడ్ ట్రక్ వద్ద ఆగారు. అక్కడ వారు బ్రోకలీ, సాసేజ్ శాండ్‌విచ్‌లను ఆర్డర్ చేశారు. వారి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన కొద్దిసేపటికే.. పోటెంజాలోని లాగోనెగ్రో సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. బాసిలికాటా పట్టణంలో ఆగి ఆసుపత్రికి తరలించే లోపే మరణించారు.
ఈ శాండ్‌విచ్‌లో ప్రాణాంతకమైన టాక్సిన్(విషం) ఫామ్ అయ్యిందని అనుమానిస్తున్నారు. అదే ఆహారాన్ని తిన్న మరో తొమ్మిది మంది బోటులిజం అనే ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో ఇటలీలో బ్రోకలీని భారీగా వెనక్కి తీసుకురావడానికి దారితీసింది. బొటులిజం అనేది క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వల్ల వస్తుంది. ఇది సరిగ్గా ప్రాసెస్ చేయని ఆహారాలలో అభివృద్ధి చెందుతుంది. ఇది నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల పక్షవాతం కలిగిస్తుంది. దాదాపు 10 శాతం కేసులలో ప్రాణాంతకం కావచ్చు.
